Reading Time: 2 minutes
Axis Bank: దేశంలోనే తొలిసారి.. ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ముఖం చూపిస్తే చాలు మొబైల్ నంబర్ అప్‌డేట్!

Axis Bank: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ రంగంలోనే సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇకపై కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకోవడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ‘ఆధార్ ఫేస్ అథెంటికేషన్’ (Aadhaar Face Authentication) ద్వారా ఇంట్లోనే కూర్చుని నిమిషాల్లో ఈ పని పూర్తి చేయవచ్చు.

దేశంలోనే మొదటిసారి..

యూఐడీఏఐ (UIDAI) సహకారంతో ఈ ‘ఫేస్ రీడింగ్’ సదుపాయాన్ని మొబైల్ యాప్‌లో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్‌ యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. డిజిటల్ పద్ధతిలో కస్టమర్లు తమంతట తామే (Self-service) మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకునే వీలు కలుగుతుంది. అంటే ఆధార్‌ డేటాబేస్‌లో ఉన్న ఫొటోతో వినియోగదారుడి ముఖాన్ని పోల్చుకోవడం ద్వారా ఈ విధానం అత్యంత పటిష్టంగా గుర్తింపును ధ్రువీకరిస్తుంది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: చమురు మంటలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.రూ.450, డీజిల్ రూ.500 దాటేసింది!

ఈ విధానం ఎలా పనిచేస్తుంది?

మూడు అంచెల భద్రత: కస్టమర్ గుర్తింపును నిర్ధారించడానికి బ్యాంక్ మూడు దశల ధృవీకరణను ఉపయోగిస్తుంది. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న ఫోటోతో కస్టమర్ ముఖాన్ని లైవ్‌లో పోల్చి చూస్తుంది. దీనివల్ల మోసాలకు తావుండదు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Air Cooler: ఏసీని సైతం తలదన్నే ఎయిర్ కూలర్‌.. అతి తక్కువ ధరల్లోనే ఏసీ లాంటి కూలింగ్‌!

భద్రత కోసం కొత్త నిబంధన:

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంక్ ఒక చిన్న నియమాన్ని పెట్టింది. కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసిన తర్వాత మొదటి 24 గంటల పాటు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలపై పరిమితులు (Limits) ఉంటాయి. ఆ తర్వాత యథావిధిగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. “కస్టమర్లకు తమ ఖాతాపై పూర్తి నియంత్రణ ఇస్తూ, అత్యంత సురక్షితమైన డిజిటల్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం” అని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సమీర్ శెట్టి ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో భద్రతను పెంచుతూనే, కస్టమర్ల శ్రమను తగ్గించే దిశగా యాక్సిస్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: చమురు మంటలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.రూ.450, డీజిల్ రూ.500 దాటేసింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి