
- మేలో 12 వేలకుచేరుతుందని అంచనా
- వెస్ట్ సిటీలో గ్రౌండ్ వాటర్ లేక
- ట్యాంకర్ల వైపే చూపు
- రోజుకు 13 వేల ట్యాంకర్లయినా
- డెలివరీ చేసేలా వాటర్ బోర్డు ప్లాన్
- ఆలస్యం కాకుండా నోడల్ఆఫీసర్ల నియామకం
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ లో నీటి ట్యాంకర్ల డిమాండ్రోజు రోజుకూ డిమాండ్పెరుగుతోంది. ముఖ్యంగా వెస్ట్‌సిటీ వైపు నీటి కొరత మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఈసారి కూడా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల బుకింగ్‌లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, నానక్‌రామ్‌గూడ, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల నుంచి భారీగా బుకింగ్‌లు జరుగుతున్నాయి. గత సంవత్సరం జనవరి లో 1,21,911 ట్యాంకర్లు బుక్కాగా, ఫిబ్రవరిలో 1,83,805కు చేరింది. దీంతో అధికారులు రాత్రింబవళ్లు ట్యాంకర్ల సరఫరా చేయాల్సి వచ్చింది.
అయితే, ఈసారి కొంత తగ్గి జనవరిలో 1,11,550 , ఫిబ్రవరిలో 1,39,456 ట్యాకర్లు బుక్అయ్యాయి. మార్చి నుంచి ఏప్రిల్2వ తేదీ వరకు 1,65,234 ట్యాంకర్ల బుక్‌చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 8వేల నుంచి 8500 ట్యాంకర్లు బుక్అవుతుండగా, మే మాసం నాటికి రోజుకు 12వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకునేందుకు వాటర్‌బోర్డు సమ్మర్ మేనేజ్మెంట్ప్లాన్అమలు చేస్తోంది. ఇక నుంచి బుక్‌చేసుకున్న 24 గంటల్లోగా ట్యాంకర్లను సరఫరా చేసే విధంగా సిద్ధమవుతోంది. గత ఏడాది కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు ట్యాంకర్లను బ్లాక్‌లో అమ్ముకోగా, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వెస్ట్ సిటీనే పెద్ద సమస్య
ప్రతి ఏడాది వెస్ట్సిటీకి నీటి సరఫరా చేయడం వాటర్‌బోర్డుకు తలనొప్పిగా మారుతోంది. ఐటీ కారిడార్, నానక్‌రామ్‌గూడ, గండిపేట, కొండాపూర్,శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వంటి ప్రాంతాల నుంచి రోజుకు 4500 నుంచి 6500 వరకూ ట్యాంకర్ల బుకింగ్జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే మార్చిలో ఇప్పటికే వెస్ట్‌సిటీ నుంచి 20 శాతం బుకింగ్ పెరిగింది. ఇక ఈ నెల (ఏప్రిల్), మేలో ఈ ఏరియాల నుంచి రోజుకు 9 వేల వరకు ట్యాంకర్లు బుక్అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బోర్డుపై పెరిగే ఒత్తిడిని తట్టుకునేందుకు ప్లాన్‌చేసుకుంటున్నారు. బోర్డుకు వచ్చే అత్యధిక ఆదాయం కూడా ఈ ప్రాంతాల నుంచే ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు.
నోడల్ ఆఫీసర్ల నియామకం
వెస్ట్‌సిటీలో ట్యాంకర్లను మేనేజ్ చేసేందుకు కొందరు అధికారులను నోడల్ఆఫీసర్లుగా నియమించారు. వీరు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని ఈ 2 నెలల పాటు రాత్రింబవళ్లు ట్యాంకర్ల సరఫరా చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా పగలు కంటే రాత్రి సమయాల్లో ఎక్కువ ట్యాంకర్లను నడపాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతమున్న ఫిల్లింగ్ స్టేషన్ల స్థానంలో మరికొన్ని టెంపరరీ ఫిల్లింగ్పాయింట్లను ఏర్పాటు చేయాలని డిసైడ్అయ్యారు. ట్యాంకర్ల సంఖ్యను కూడా 1135 నుంచి 1250కి పెంచడానికి ప్లాన్చేశారు. నీటి నిల్వలకు కొదవ లేదని, కానీ ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న ఒత్తడిని తట్టుకునేందుకే తాము ప్రణాళికలు రచిస్తున్నట్టు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
ట్యాంకర్ ట్రాకింగ్ యాప్
ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా వాటర్‌బోర్డు అధికారులు ట్యాంకర్ ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ యాప్‌ద్వారా ఎవరైనా ట్యాంకర్ బుక్ చేసుకుంటే స్టార్టయ్యిందా లేదా? ఎక్కడ ఉంది? ఎక్కడిదాకా వచ్చింది అన్న వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, ఫిల్లింగ్ పాయింట్వద్ద సీసీ కెమెరాలను అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వేసవిలో వాటర్ ట్యాంకర్ల మేనేజ్ మెంట్ ఇలా
విషయం మార్చి ఏప్రిల్
ఫిల్లింగ్ స్టేషన్లు 82 89
ఫిల్లింగ్ పాయింట్స్ 129 143
ట్యాంకర్లు 1135 1250