Reading Time: < 1 minute

ఇంటర్వ్యూకు అనుమతించ లేదని కోర్టు ధిక్కార నోటీసులు

Caption of Image.
  •     ముంబై ఐఐఎం చైర్మన్, డైరెక్టర్లకు కోర్టు ఆదేశాలు జారీ

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ అడ్మిషన్​కు సంబంధించి అభ్యర్థిని వ్యక్తిగత ఇంటర్వ్యూకు అనుమతించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ముంబై ఐఐఎం చైర్మన్ శశికిరణ్‌‌‌‌శెట్టి, డైరెక్టర్ల మనోజ్‌‌‌‌ కె.తివారీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. ఒకవేళ చేయకపోతే రూ.10 వేల  చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

షార్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో తనకంటే తక్కువ మార్కులున్నవారిని ఇంటర్వ్యూకు పిలిచి తనకు అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్​ చేస్తూ మల్కాజిగిరి గుండ్లపోచంపల్లికి చెందిన కటారు సత్యసాయి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనిపై విచారించిన కోర్టు ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు పిటిషనర్‌‌‌‌ను అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సత్యసాయి కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ దాఖలు చేయగా దీనిపై విచారించిన జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక ఐఐఎం చైర్మన్, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.