
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేశారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగానే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ గ్రాండియర్ గా రామయణం సినిమా ఉండనుందని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గురువారం విడుదలైన ఈ మూవీ టీజర్ చాలా రిచ్ గా, గ్రాండియర్ గా ఉంది. అయితే కొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్ మరీ నాసిరకంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే టీజర్ లోనూ కొన్ని తప్పులు దొర్లాయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే దానికిఅన్ని రకాలుగా సిద్ధమవ్వాలి. దర్శకుడికి చాలా ముందుచూపు ఉండాలి. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారించాలి. లేకపోతే నేటి సోషల్ మీడియా యుగంలో ఈజీగా దొరికిపోతారు. ఆదిత్య ధర్ ‘ధురందర్ 2’ను అందరూ ప్రశంసించారు. అదే క్రమంలో ఇందులో కొన్ని తప్పులను కూడా ఎత్తి చూపారు. ఇప్పుడు, ‘రామాయణం’ టీజర్‌లో కొన్ని తప్పులు బయటపడటంతో, దర్శకుడు నితేష్ తివారీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
టీజర్ లో రాముడు జనంలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక సన్నివేశం ఉంది. అప్పుడు ఒక బాలుడు నమస్కరిస్తాడు. రాముడు మరికొంత ముందుకు వెళ్లగానే అదే బాలుడు రాముడిపై పువ్వులు విసురుతూ కనిపిస్తాడు. నెటిజన్లు దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామాయణం టీమ్ ను ట్రోల్ చేస్తున్నారు. మరో సీన్ లో రాముడు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు. అయితే సైనికులు మాత్రం ఎటో చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నితేష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. కన్నడ స్టార్ యశ్ రావణుడిగా యాక్ట్ చేస్తున్నారు. మొత్తం రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కనుంది. మొదటి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
First frame: kid is bowing down and ranbir crossed him
Next frame: same kid is showering flowers on himAnd we’re competing with Hollywood with these AI videos in big 2026
#Ramayana pic.twitter.com/TgSOAbCmUE
— Raj (@idfcwau) April 2, 2026
They are claiming that Ramayana is being made on a budget of ₹4000 crore, but from the first look, it feels heavily AI-driven.
DNEG is a VFX company, not a direction studio. What truly makes a film successful is direction. Nitesh Tiwari’s biggest success is Dangal (Dangal is… https://t.co/9PEQSQ8kXs pic.twitter.com/CLu51szx5t
— VictorVon Solanki (@VictorVonS_) April 2, 2026
రామాయణం సినిమా టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

