
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజులపాటు సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. తిరిగి సోమవారం ఉదయం నుంచి యథావిధిగా మీసేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.