Reading Time: < 1 minute

రూ.25 కోట్ల ప్లేయర్‎ను తీసేయండి.. మీరు గెలవాలంటే అదొక్కటే మార్గం: కేకేఆర్‎కు హర్భజన్ సింగ్ సూచన

Caption of Image.

ఐపీఎల్ 19వ సీజన్‎ను కోల్‎కతా నైట్ రైడర్స్ పేలవంగా ఆరంభించింది. ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. సీజన్ తొలి మ్యాచులో ముంబై చేతిలో ఓడిన కేకేఆర్.. రెండో గేమ్‎లో సన్ రైజర్స్‎పై ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కేకేఆర్‎కు కీలక సూచన చేశాడు. రూ.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‎ను జట్టు నుంచి తప్పించాలని సూచించాడు. 

గ్రీన్‎ ఆల్‌రౌండర్‌గా కాకుండా ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తే అతడిని తుది జట్టు నుంచి తొలగించాలని అన్నాడు. ఎందుకంటే గ్రీన్ కంటే మెరుగైన బ్యాటర్లు కేకేఆర్‎లో ఉన్నారని పేర్కొన్నాడు. గ్రీన్ అతడి స్థానంలో సీఫెర్ట్, రోవ్‎మన్ పావెల్ వంటి హిట్టర్లను ఆడించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆల్ రౌండర్ కోటాలో గ్రీన్‎ను జట్టులోకి తీసుకున్నప్పటికీ గాయం కారణంగా అతడు బౌలింగ్ చేయకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారిందన్నారు. 

►ALSO READ | IPL 2026: పంజాబ్ Vs చెన్నైహెడ్ To హెడ్ రికార్డ్స్.. లాస్ట్ 7 మ్యాచుల్లో అయ్యర్ సేనదే హవా

సీజన్ స్టార్టింగ్‎లోనే వరుస ఓటములతో కేకేఆర్ ఒత్తిడికిలోకి వెళ్లిందని.. టోర్నీలో ముందుకు సాగాలంటే  జట్టులో మార్పులు చేయాల్సిందేనని అన్నాడు. గ్రీన్ విషయంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ సమతుల్యతను దెబ్బతీస్తోందని రహానే అంగీకరించాడు. దీంతో రెండు మ్యాచుల్లో విఫలమైన గ్రీన్‎ను కేకేఆర్ పక్కకు పెడుతుందా లేదా అనే విషయం నెక్ట్స్ మ్యాచులో తెలియనుంది. 

ముంబై, హైదరాబాద్ చేతిలో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన కేకేఆర్ నెక్ట్స్ మ్యాచును పంజాబ్ కింగ్స్‎తో ఆడనుంది. తమ సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచులో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తోంది. మరీ ఈ మ్యాచులోనైనా రహానే సేనను విజయం వరిస్తోందో లేక హ్యాట్రిక్ ఓటమి మూటగట్టుకుంటుందో చూడాలీ. 

©️ VIL Media Pvt Ltd.