
ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 3) చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో పంజాబ్ టాస్ గెలించింది. పంజాబ్ కెప్టెన్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇరు జట్లు సేమ్ టీమ్‌తో బరిలోకి దిగాయి. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఈ మ్యాచులో భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. లీగులో తొలి మ్యాచులో ఓడిన చెన్నై సొంత గడ్డపై పంజాబ్‌ను ఓడించి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచులో ఆల్ రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ గెలుపు జోష్‌లో బరిలోకి దిగుతోంది.
జట్లు:
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్