
CSK : ఐపీఎల్ 2026 సీజన్ ఏడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు చేసింది. ఈ స్కోరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా సిఎస్‌కే రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సిఎస్‌కే 36 సార్లు ఈ మార్కును అందుకోగా, ఆర్సీబీ 35 సార్లు సాధించి రెండో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్న చెన్నై జట్టు, తన దూకుడును ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది.
సిఎస్‌కే ఈ రికార్డును అందుకోవడంలో యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే 73 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి తోడుగా శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లోనే 7 బౌండరీలతో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ముగ్గురి విధ్వంసం కారణంగానే చెన్నై సునాయాసంగా 200 పరుగుల గీతను దాటేసింది.
అత్యధిక సార్లు 200 స్కోరు చేసిన జట్ల జాబితాను పరిశీలిస్తే.. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో 32 సార్లు ఈ ఘనత సాధించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 30 సార్లు ఈ మార్కును దాటింది. ఇక గత కొన్ని సీజన్లుగా దూకుడు బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 28 సార్లు 200 ప్లస్ స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ 26 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 19 సార్లు ఈ ఫీట్ సాధించాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ రికార్డు సాధించడం వారి బ్యాటింగ్ లోతును తెలియజేస్తోంది. ఏ పిచ్ పైనైనా, ఎలాంటి బౌలింగ్ అటాక్ పైనైనా భారీ స్కోర్లు నమోదు చేయడం సిఎస్‌కేకు వెన్నతో పెట్టిన విద్య. 2008 నుంచి ఇప్పటివరకు ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు ఈ జట్టులో మెరిసినప్పటికీ, ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అభిమానులు మాత్రం “రికార్డులు సిఎస్‌కేను వెతుక్కుంటూ వస్తాయి.. సిఎస్‌కే రికార్డుల వెనుక పరిగెత్తదు” అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఐపీఎల్‌లో 200+ స్కోర్లు చేసిన టాప్ జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ – 36 సార్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 35 సార్లు
పంజాబ్ కింగ్స్ – 32 సార్లు
ముంబై ఇండియన్స్ – 32 సార్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ – 30 సార్లు
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..