
నాగర్‌కర్నూల్: ఎస్టి కార్పొరేషన్ ద్వారా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎస్టిల ఓట్లు కావాలిగానీ, వాళ్ల సంక్షేమం పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని బడాయి మాటలు చెబుతున్నారని విమర్శించారు.