Reading Time: < 1 minute

మెట్రో భూములు కాజేసే కుట్ర : బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద

Caption of Image.
  • బీఆర్ఎస్​ ఎల్పీ విప్​ కేపీ వివేకానంద 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి రియల్​ ఎస్టేట్​ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్​ఎల్పీ విప్​ కేపీ వివేకానంద అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్​సీయూ భూములు, హిల్ట్​ పాలసీ, టీడీఆర్​ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అనుచరులకు కట్టబెట్టి తన ఆస్తులను పెంచుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో మీడియాతో  ఆయన మాట్లాడారు. 

హైదరాబాద్  నడిబొడ్డున ఉండే 250 ఎకరాలను కొల్లగొట్టేందుకు రేవంత్ సిద్ధమయ్యారన్నారు. ఎల్​అండ్​టీని బ్లాక్ మెయిల్ చేస్తూ మెట్రోకి చెందిన 250 ఎకరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పనికిరాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటే రెండో వరుసలో బండి సంజయ్ ఉంటారన్నారు.

©️ VIL Media Pvt Ltd.