Reading Time: < 1 minute

నావికాదళంలోకి మరో అడ్వాన్స్డ్ స్టెల్త్ యుద్ధనౌక.. విశాఖలో ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం

Caption of Image.

భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం.. ఐఎన్ ఎస్  తారాగిరి అధికారికంగా నావికాదళంలో చేరింది.శుక్రవారం (ఏప్రిల్3) రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నావ్ డాక్ యార్డ్ లో  తారాగిరిని జలప్రవేశం చేయించారు.  స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆధునిక స్టెల్త్ యుద్ధనౌక  ఐఎన్ఎస్ తారాగిరి చేరికతో భారత నావికాదళం మరింత బలోపేతం అయిందని  రక్షణమంత్రి అన్నారు. 6వేల670 టన్నుల యుద్ధనౌక నేవీలో చేరడంతో తీరప్రాంత రక్షణ గస్తీ  మరింత బలపడిందన్నారు. 

►ALSO READ | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్: మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ

మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక అత్యాధునిక ఇంజనీరింగ్, దేశీయంగా రూపొందించారు. రక్షణ రంగ తయారీలో భారత్ సాధిస్తున్న ఆత్మనిర్భరత దిశగా సాగుతున్న ప్రయాణంలో ఇది కీలక మైలురాయి గా నిలుస్తుంది. 

ఈ యుద్ద నౌకలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్షిపణులు, మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ,లేటెస్ట్ ఆంటీ సబ్ మెరిన్  సిస్టమ్  ఉన్నాయి. వేగంగా స్పందించే లేటెస్ట్ కంబాట్ మేనేజ్ మెంట్ సిస్టమ్  ఈ యుద్దనౌకలో హైలైట్.. ఈ నౌక అధునాతన స్వదేశీ సోనార్ వ్యవస్థలతో ,వాయు విధ్వంసక, ఉపరితల విధ్వంసక, జలాంతర్గామి విధ్వంసక మిషన్ల సామర్థ్యం కలిగి ఉంది.

©️ VIL Media Pvt Ltd.