Reading Time: < 1 minute

బులవాయో: ఐసిసి అండర్-19 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ సూపర్ సిక్స్ మ్యాచుల్లో గ్రూప్-2లో ఉన్న భారత్ ఆడిన మూడు మ్యాచుల్లో మూడింట విజయం సాధించి టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో భారత్ స్థిరపడుతుంది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలై మూడో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌లు జట్టులో ఒక మార్పు చేశాయి. భారత్ జట్టులో ఉదవ్ మోహన్ స్థానంలో దీపేశ్ దేవేంద్రన్ జట్టులోకి రాగా.. పాకిస్థాన్ జట్టులోకి అలీ హసన్ వచ్చాడు.

తుది జట్లు:

భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్.

పాకిస్థాన్: హంజా జహుర్(కీపర్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.