Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మూడు గంటలకు సిట్ అధికారులు కెసిఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కెసిఆర్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. కెసిఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్‌లో సిట్‌ విచారణ చేయనుంది. కెసిఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి అధికారులు అనుమతించే అవకాశం ఉంది. విచారణను అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బంది అనుమతికి పోలీసులు నిరాకరించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు హరీష్, కెటిఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ కోసం కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని తన నివాసం నందినగర్ కు వచ్చారు. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున్న నందినగర్ చేరుకున్నారు.