Reading Time: < 1 minute

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిని టి20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టి 20ల్లో 46 పరుగులు తేడా గెలిచి కివీస్ కకావికలం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 271 పరుగులు చేసింది. ఇషాన్ 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి పట్టపగలు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్, హార్ధిక్ పాండ్యాలు కివీస్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు 23 సిక్సర్ల మోతమోగించారు. ఒక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు(69) కొట్టిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ జట్టు (64) పైన ఉంది.

అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. భారత జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు 250పైగా పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా జింబాబ్వే మూడు సార్లు మాత్రమే చేసి రెండో స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్ లో రెండు జట్లు కలిపి 517 పరుగులతో సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్లు తొలి స్థానంలో ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు 496 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాయి. వరసగా 489 పరుగులతో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్లు, 488 పరుగులతో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు, 488 పరుగులతో సెర్బియా వర్సెస్ బల్గేరియా జట్లు ఉన్నాయి.