
హైదరాబాద్: నిజామాబాద్ గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్స్ జ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకర్చుతామని జూపల్లి కృష్ణారావు తెలియజేశారు.