Reading Time: < 1 minute

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టి-20ల సిరీస్‌ని టీం ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి-20 ప్రపంచకప్ ముందు జరిగిన ఈ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. అన్ని విభాగాల్లో రాణించి.. టి-20 ప్రపంచకప్‌కి తాము సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పింది. ప్రస్తుతం భారత జట్టు భీకరమైన ఫామ్‌లో ఉంది.. అయినప్పటికీ.. భారత్‌కు మరింత బలం చేకూరేలా మరో శుభవార్త అందింది. గాయం కారణంగా కివీస్‌తో సిరీస్‌కి దూరమైన తిలక్ వర్మ.. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షలో తిలక్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడికి సిఒఇ వైద్య బృందం క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ క్రమంలో తిలక్ ఫిబ్రవరి 3న (మంగళవారం) ముంబైలో జట్టుతో జతకట్టనున్నాడు. ఇక ఐసిసి టి-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత్, యుఎస్ఎ మధ్య జరగనుంది. జనవరి 15వ తేదీన చిరకల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతుంది.

టీ-20 ప్రపంచకప్‌ 2026 భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూసింగ్.