
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన ఎర్రవెల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కెసిఆర్ తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి, మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులకు అందుబాటులోకి రానున్నారు.