
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 4వ తేదీన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో, 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని రూరల్‌లో, 7వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8వ తేదీన భూపాలపల్లిలో, 9వ తేదీన మెదక్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. కాగా, 2వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ అమరవీరుల కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.