
ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు.ఇషాన్ కిషన్(103: 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు),కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (63: 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్ లు) వీర విహరం చేశారు.సూర్య,ఇషాన్ మూడో వికెట్ కు 57 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒపెనర్ సంజు శాంసన్ (6) మరోసారి నిరాశపర్చాడు. పెర్గూసన్ వేసిన 2.5 ఓవర్ కు బెవన్ జాకబ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫెర్గూసన్ వేసిన 4.6 ఓవర్ కు అభిషేక్ శర్మ(30: 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో హార్థిక్ పాండ్య (42; 17 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, డఫీ, జెమీసన్,శాంట్నర్ తలో వికెట్ తీశారు.