
నేడు పరిశీలన
పురపోరుకు భారీగా నామినేషన్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సా.5గంటల తర్వాత కార్యాలయాల్లో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. శనివారం(జనవరి 31) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వర కు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలిం గ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రం లో 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు, ఏడు కార్పోరేషన్లలోని 414 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.