
మరికొన్ని రోజుల్లో టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈసారి భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే దేశాలు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యుఎస్ఎ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో మోనాంక్ పటేల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2024 ఎడిషన్‌లో పాల్గొన్న జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు ఈ ఎడిషన్‌కి కూడా ఎంపికయ్యారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య జట్టులోకి వచ్చారు.
గత ఎడిషన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి యుఎస్‌ఎ సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించి సూపర్-8కి కూడా అర్హత సాధించింది. ఇది యుఎస్ఎకి రెండు టి-20 ప్రపంచకప్. ఈ సారి కూడా యుఎస్ఎ జట్టు పలు సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈసారి గ్రూప్-ఎలో ఉన్న యుఎస్ఎ.. భారత్, పాకిస్థాన్ లాంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఇదే గ్రూప్‌లో నమీబియా, నెదర్లాండ్స్‌పై విజయం సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న టిం ఇండియాతో జరిగే మ్యాచ్‌తో యుఎస్ఎ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
టి-20 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఎ జట్టు..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.