
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ గ్లోబ్‌ట్రాటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటేనే ఆ సినిమా విడుదల ఆలస్యంగా జరుగుతుంది. కానీ, ఈ సినిమాను అనుకున్న సమయానికే తీసుకువచ్చేలా జక్కన ఏర్పాటు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల అవుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల అవుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు ఖుషీ అయ్యారు.
ఉగాది, గుడిపడ్వాని పురస్కరించుకొని 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయనుండటం గమనార్హం. ఆ తర్వాత వేసవి సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి. తమిళ సంవత్సరాదినీ అదే సమయంలో జరుపుకోనున్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక.. అంటార్కిటికాలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అక్కడ షూటింగ్ జరిపిన తొలి భారత చిత్రంగా ‘వారణాసి’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
April 7th, 2027… #VARANASI. pic.twitter.com/9i5j1TZg5b
— rajamouli ss (@ssrajamouli) January 30, 2026