
హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. భారీ బడ్జెట్, యాక్షన్ సన్నివేశాలు.. తదితర అంశాలు లేకపోయినా.. శర్వా సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం ప్రతీ తెలుగు సినీ అభిమానిలో ఉంది. అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతున్నాడు శర్వా. కాగా, ఈ సంక్రాంతికి కూడా శర్వా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అదే ‘నారీ నారీ నడుమ మురారీ’. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వా ఈ సినిమాలో కలిపించాడు. పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా వాటికి పోటీ ఇస్తూ.. మంచి హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మరి వెండితెరపై బుల్లితెరపై ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.