Reading Time: < 1 minute

వరల్డ్ లెజండ్స్ ప్రొ టి-20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారత్‌లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ప్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పుఱె పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి. కాగా, ఈ లీగ్‌లో 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి.

ప్రారంభ మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర ఆటగాడు చాడ్విక్ వాల్టన్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని వారియర్స్ జట్టు సునాయాసంగా చేధించింది. వాల్టన్ 62 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సులతో 128 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.