
హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో మల్లికార్జున్, రేవతిల కుమార్తె శార్వి (4) ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చిన్నారిని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కాకపోతే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి.