
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, ఆయన కెరీర్ ఆరంభంలో మంచి లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఓ మంచి లవ్ స్టోరీనే ‘హ్యాపీ’ సినిమా. మంచి లవ్ స్టోరీ మాత్రమే కాదు.. ఈ సినిమాలో అటు కామెడీ, ఇటు సాంగ్స్ అదిరిపోతాయి. అయితే ‘హ్యాపీ’ సినిమా విడుదలైన నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి గ్రాండ్ విజయాన్ని అందించిన దర్శకుడకు కరుణాకర్‌కి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రయాణంలో తనతో భాగమైన కో-స్టార్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్‌పేయి, తనతో పాటు పని చేసిన ఇతర ఆర్టిస్టులను ఆయన ప్రశంసించారు. ఇక ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు.. ఇతర సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచిన తన తండ్రి అల్లు అరవింద్‌కి గీతా ఆర్ట్స్ బ్యానర్‌కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా హ్యాపీ సినిమాను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి అల్లు అర్జున్ ఇలాంటి రొమాంటిక్ కామెడీ చిత్రం చేయాలని ఆశపడుతున్నారు.
20 years of #Happy. 🖤
One of the most enjoyable films of my journey.
Grateful to #AKarunakar garu for the beautiful vision.
My wonderful co-star dear @geneliad, the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride.@thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR— Allu Arjun (@alluarjun) January 27, 2026