
మన తెలంగాణ/హైదరాబాద్: టీ హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్‌ను ప్రత్యేక స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా నిలిచిన ఈ కేంద్రంలోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికల్లో వార్తా కథనాలుగా వచ్చాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.
అయితే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ రామకృష్ణా రావుకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్‌ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని ఆయన సీఎస్ రామకృష్ణా రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’ కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎస్‌కు దిశానిర్దేశం చేశారు. టీ-హబ్ అనేది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన స్టార్టప్ హబ్ అని, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వల్ల దాని ప్రాధాన్యత, పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రాంగణం పూర్తిగా వారి కార్యకలాపాలకే కేటాయించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను ప్రకటించింది. 2034 నాటికి హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ కంపెనీలు రావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోంది.