Reading Time: < 1 minute

ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరో మహిళను పెళ్లి చేసుకున్నందుకు చేసిందట. వివరాలలోకి వెళితే.. కర్నూలు కు చెందిన ఓ డాక్టర్ ఆదోనికి చెందిన యవతి కొన్ని సంవత్సరాలు గా ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం విడిపోయారు. ఈ క్రమంలో డాక్టర్ మరో మహిళా డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక వారిద్దరిని విడదీయాలనుకుంది. ఈ క్రమంలో ఈ నెల 9న మహిళా డాక్టర్ విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు బైక్ తో ఢీకొట్టారు. దీంతో మహిళా డాక్టర్ కింద పడింది. ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కించే క్రమంలో వైరస్ ఇంజక్షన్ ఎక్కించారు. ఈ ఘటనపై మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటన స్థలం వద్ద ఉన్న సిసి కెమెరాల సహాయంతో నిందితును గుర్తించి అరెస్ట్ చేశారు.