Reading Time: < 1 minute

“హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో తాత వయసున్న ఇద్దరు అతిథులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో వారిపై అసహ్యం కలిగింది” అని బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. “వేదికపైకి వెళుతుండగా ఆ ఇద్దరు, వారి కుటుంబ సభ్యులు ఫొటోల పేరుతో నా నడుముపై చేతులు వేశారు. వెంటనే ‘సర్ దయచేసి మీ చేతులు తీయండి’ అని చెప్పాను. అయినా వారి ప్రవర్తన మారలేదు. దీంతో ప్రదర్శనను అనుకున్న సమయానికన్నా ముందే ముగించాల్సి వచ్చింది. నాలాంటి వారికే ఇలా జరిగితే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి” అని అన్నారు.