Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: గత సంవత్సరం ఆహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ.1100కోట్ల పరిహారం అందింది. ఈ మొత్తం వివిధ బీమా సంస్థల నుంచి ఎయిరిండియా అందుకున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన ప్రమాదంలో విమానం ముక్కలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది దుర్మరణం చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఎయిరిండియాకు 125 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.1100కోట్లకుపైగా అందినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబాలకు కూడా 25మిలియన్ డాలర్లు చెల్లించే ప్రక్రియ కూడా మొదలైనట్లు సమాచారం. బాధితులకు పరిహారం మరింత పెరిగే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో హాస్టల్‌పై విమానం కుప్పకూలడంతో అందులోని ప్రయాణికులతో పాటు విద్యార్థులు కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు కూడా పరిహారం దక్కేలా ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.