Reading Time: < 1 minute

8 సంవత్సరాలుగా సుమారుగా 2,700ల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడం, మరో 200ల మంది కానిస్టేబుళ్లను అప్‌గ్రేడేషన్ చేయకపోవడంతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. దీంతోపాటు 2017లో అధికారులు బదిలీలు జరగ్గా, 2018లో కానిస్టేబుళ్ల బదిలీలు, 2022 ఏప్రిల్‌లో ఈఎస్‌లకు పదోన్నతి ఇచ్చి వారికి బదిలీలు, 2024లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 మందిని చేసిన బదిలీలు తప్ప ఇప్పటివరకు ఈ శాఖలో పూర్తిస్థాయి బదిలీలు, పదోన్నతులు జరగలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జనవరిలో 99 మందికి పదోన్నతులు కల్పించిన ఎక్సైజ్ శాఖ అధికారులు వారికి పోస్టింగ్ ఇస్తే అనంతరం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు కూడా పదోన్నతులు ఇచ్చి బదిలీ చేసే అవకాశం ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.