Reading Time: < 1 minute

అండర్-19 వరల్డ్ కప్‌ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై యువ భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ(23 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులు) 40 పరుగులు చేశాడు. ఆయూష్ మాత్రే (27 బంతుల్లో 2 ఫోర్లు, ఆరు సిక్సులు) 53 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ బౌండరీలు బాదుతూ చెలరేగడంతో.. ఏడు వికెట్ల తేడాతో కిస్ ను టీమిండియా(డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి) ఓడించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. 

అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో కల్లమ్ సామ్సన్ 37 పరుగులు, సెల్విన్ సంజయ్ 28 పరుగులు, జాకబ్ కాటర్ 23 పరుగులు చేశారు. టాపార్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బౌలర్లలో ఆర్ అంబ్రిష్ నాలుగు వికెట్లు, హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖిలాన్ పేటల్, మొహమ్మద్ ఎనాన్, కనిష్క్ చౌహాన్ లు తలో వికెట్ తీశారు.