
మేడారం: ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ ను ప్రారంభించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించడం జరిగింది. లక్షలాది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన సమ్మక్క–సారలమ్మ తల్లి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నిండాలని ఆకాంక్షించారు.