Reading Time: < 1 minute

నాంపల్లి: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల కలిగిన భవనంలోని బచ్చా క్యాజిల్ ఫర్నిచర్ షాపులో మంటలో చెలరేగాయి. స్థానికుల సమాచార ంమేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తల్లి, ఇద్దరు పిల్లలు చిక్కుకున్నట్టు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి రోబోను పంపి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. పోలీసులు, హైడ్రా, విపత్తు, జిహెచ్‌ఎంసి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం చుట్టూ పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.