
హైదరాబాద్: టి20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌కు ఐసిసి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాంట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. భారత్ లో తాము మ్యాచ్ ఆడబోమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసిసిని బంగ్లాదేశ్ కోరింది. బంగ్లాదేశ్ వినతిని ఐసిసి నిరాకరించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ జట్టు పర్యటించదని.. ఈ టోర్నమెంట్ ను తప్పుకుంటున్నట్లు బిసిబి ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన అంతర్గత బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిబి వెల్లడించింది. గతంలో ఐపిఎల్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆడాలనేదే తమ ఉద్దేశమని బిసిబి అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ పేర్కొన్నారు. 2026 ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి తొలగించిన సంఘటనను కూడా ప్రస్తావించారు. మ్యాచ్‌లను భారత్ నుండి వేరే చోటికి మార్చాలని ఐసిసి పాలక మండలిని కోరామని, సమస్యకు పరిష్కారించడంలో ఐసిసి విఫలమైందని బిసిబి దుయ్యబట్టిన విషయం విధితమే.