
బులవాయో: అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ 7.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులతో ఆటను కొనసాగుతుంది. వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. కివీస్ బ్యాట్స్‌మెన్లు అర్యన్ మన్ (5), హుగో బోగు(4), టామ్ జోన్స్(2) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో స్నేహిత్ రెడ్డి(6), మార్కో అల్పే(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో ఆర్‌ఎస్ అంబ్రిష్ రెండు వికెట్లు తీయగా హెనీల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఈ ఇప్పటికే యుఎస్‌ఎ, బంగ్లాదేశ్‌పై భారత జట్టు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-బిలో టీమిండియా తొలి స్థానంలో ఉంది.
భారత జట్టు: వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుండు (వాక్), ఆరోన్ జార్జ్, కనిష్క్ చౌహాన్,
ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఈనాన్
న్యూజిలాండ్ జట్టు: ఆర్యన్ మన్, హ్యూగో బోగ్, టామ్ జోన్స్ (సి), స్నేహిత్ రెడ్డి, మార్కో ఆల్పే (వికెట్ కీపర్), జాకబ్ కాటర్, జస్కరన్ సంధు,
కల్లమ్ సామ్సన్, ఫ్లిన్ మోరీ, సెల్విన్ సంజయ్, మాసన్ క్లార్క్