Reading Time: < 1 minute

హైదరాబాద్: నాంపల్లి పరిధిలోని చీరక్ గాలి లైన్‌ వద్ద ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో ఇద్దరు పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.