
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం వెళ్తుండగా లింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. అతివేగంగా బైక్‌పై ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొన్నారు. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన సాయి మహేష్ (35), గట్టు రాంబాబు (39)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో నమోదయ్యాయి.