Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి శాఖ ల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు మొద లు కానున్నాయి. ఈ సమావేశాలకు ఆయా శాఖ ల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉ పముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ప్రస్తుతం శాఖలవారీగా బడ్జెట్ రూపకల్ప న ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుకు సంబంధించి అంచనాలను ప్రాథమికంగా తయారు చేసింది. ఈ అంచనాలపై సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్ 2026 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. సంబంధిత మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంటకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సమావేశాలు సాగుతాయి. ఇందుకు సంబంధించి భట్టి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల వారీగా ఖరారు చేసి న సమీక్షల షెడ్యూల్‌ను శాఖలకు స్పష్టం చేశారు.

పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ప్రభుత్వ శాఖలు రూపొందించిన అంచనాల ఆధారంగా చర్చిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, డిమాండ్‌కు అనుగుణంగా కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపైనా చర్చించనున్నారు. పాత పథకాలకు బడ్జెట్ డిమాండ్‌తో పాటు కొత్త పథకాలకు బడ్జెట్‌పై అవసరాలపై అంచనాకు రానున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖతోపాటు సాధారణ పరిపాలన విభాగం, హోమ్, లా అండ్ ఆర్డర్, న్యాయ తదితర శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుండడంతో ఆయా సమావేశాలకు సీఎం అధ్యక్షత వహిస్తారు. సమీక్షల అనంతరం కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తారు.

మున్సిపోల్స్ అనంతరం బడ్జెట్ సమావేశాలు : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలూ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫిబ్రవరి నాలుగో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఆ బడ్జెట్ ఆధారంగా కేంద్రం నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు ఏమేరకు నిధులు వస్తాయన్నది అంచనా వేసి 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించనుంది. ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.