
అమరావతి: మర్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై కర్రల లోడ్ తో ఆగి ఉన్న ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొంది. అప్పటికే ప్రమాదానికి గురై ఉన్నప్రైవేట్ బస్సును ఆర్టిసి బస్సు ఢీకొనడంతో రెండు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. మరో 10 మందికిపైగా గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.