Reading Time: < 1 minute

బైక్ టాక్సీలను నిషేధిస్తూ గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు మంగళవారం నాడు తప్పుపట్టింది. బైక్ టాక్సీల పై నిషేధాన్ని హైకోర్టు జనవరి 23న రద్దు చేసింది. ఈ విషయంలో బైక్ టాక్సీ అగ్రిగేటర్లు, వ్యక్తిగత బైక్ టాక్సీ యజమానులు, ఇతరులు దాఖలు చేసిన అపీళ్లను అనుమతించింది. మోటార్ సైకిళ్లను రవాణా వహనాలుగా నమోదు చేయాలని, కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్లను మంజూరు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, జస్టిస్ సిఎం జోషీలతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీకి సంబంధించిన అంశాలపై రవాణా అధికారులు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ, మోటర్ సైకిళ్లు అనుమతించబడవు అనే కారణంతో వారు పర్మిట్లను, రిజిస్ట్రేషన్ ను తిరస్కరించలేరని డివిజన్ బెంచ్ పేర్కొంది.