Reading Time: < 1 minute

మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపిం చారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటేనని స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమా ణం చేస్తానని జోగి రమేష్ వెల్లడించారు.