Reading Time: < 1 minute

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభాన్ని రచిన్ రవీంద్ర (44) కొనసాగించగా.. మిచెల్ శాంట్నర్ ( 47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీయగా, వరుణ్, శివమ్,హార్దిక్ పాండ్యా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు.