Reading Time: < 1 minute

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో జైష్ -ఏ-మొహమ్మద్ సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్ట్ ను భద్రతాదళాలు హతమార్చాయని పోలీసులు తెలిపారు. బిల్లావర్ జనరల్ ప్రాంతంలో భద్రతదళాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ లో ఆ ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు జమ్మూ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్ సేన్ టుట్టి తెలిపారు. మరణించిన జైషే టెర్రరిస్ట్ ను ఉస్మాన్ గా గుర్తించారు. ఉధంపూర్ – కథువా బెల్ట్ లో రెండేళ్లుగా జేషే మొహమ్మద్ తరుపున చురుగ్గా పనిచేస్తున్న ఉస్మాన్, తరచు సరిహద్దు దాడి చొరబడుతూ తప్పించుకు తిరుగుతున్నాడని ఆయన తెలిపారు. ఉస్మాన్ గతంలోనూ ఓ ఎన్ కౌంటర్ సందర్భంగా తప్పించుకున్నాడు. జనవరి 7, 13 తేదీలలో వరుసగా, కహోగ్ , మజోట్ అడవులలో వరుస ఎన్ కౌంటర్లు జరిపినట్లు అధికారులు తెలిపారు.