Reading Time: < 1 minute

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని విడుదల చేశాయి.కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో మేడారం చుట్టు పక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్కూట్ పేరిట గతంలో ఎనభై కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన బౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. అదేవిధంగా యునెస్కొ గుర్తింపు లభించిన రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం రూ. 140 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.