Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 10 నుంచి 16 వరకు పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సెలవులు ఉండగా, ఈ నెల 17న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అయితే శుక్రవారం కునుమ పండుగ కావడంతో గ్రామాలకు వెళ్లిన విద్యార్థులు శనివారం నాటికి నగరానికి చేరుకుని స్కూళ్లకు వెళ్లకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.