Reading Time: < 1 minute
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. పీఎఫ్ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.. ప్రత్యేక పోర్టల్ ఇదే..

పీఎఫ్ ఖాతాదారులకు ఏదైనా సమస్య ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి..? పీఎఫ్ అకౌంట్, విత్ డ్రా, బదిలీలు లేదా ఇతర సేవల్లో ఇబ్బందులు వస్తే ఎవరిని సంప్రదించాలి లాంటి అనేక ప్రశ్నలు ఉంటాయి. అయితే పీఎఫ్ ఖాతాదారుల కోసం EPFiGMS పోర్టల్ అందుబాటులోకి ఉంది. ఇందులోకి వెళ్లి సులభంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈపీఎఫ్‌వో ఈ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. మీరు ఉచితంగా ఈ పోర్టల్‌లో మీ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలి..?

-EPFiGMS పోర్టల్ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో ఫిర్యాదు నమోదు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి

-ఆ తర్వాత పీఎఫ్ సభ్యుడు, యజమాని, పెన్షనర్ లాంటి వివరాలను ఎంటర్ చేయండి

-మీ UAN నెంబర్ నమోదు చేయండి

-సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-మీ వ్యక్తిగత, పీఎఫ్ వివరాలను ఎంటర్ చేయండి

-ఫిర్యాదు వివరాలు అందించండి

-సరళమైన భాషలో మీ సమస్యను తెలపండి

-ఆ తర్వాత సబ్మిట్ చేయండి

స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

-మీరు ఫిర్యాదు చేశాక అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

-EPFiGMS పోర్టల్‌కు వెళ్లండి

-స్టేటస్ చూడండి అనే ఆప్షన్ ఎంచుకోండి

-రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి

-మీ స్టేటస్ చెక్ చేసుకోండి

ఆలస్యమైతే ఏం చేయాలి..?

-EPFiGMS పోర్టల్‌కి లాగిన్ అవ్వండి

-రిమైండర్ విభాగానికి వెళ్లండి

-ఫిర్యాదు నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

-రిమైండర్ పంపండి

-ఇక ఫిర్యాదుపై మీరు సంతృప్తి చెందకపోతే ఉన్నతాధికారికి తెలపవచ్చు.