
బసిరెడ్డిపల్లి: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బసిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల పాపను దారుణంగా చంపేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఐదు సంవత్సరాల తేజశ్రీ అనే బాలిక పాప అవ్వ తాతల రాత్రి సమయంలో దగ్గర నిద్రపోయింది. తేజశ్రీ హత్య చేసి గ్రామ శివారులో చెరువు కట్టమీద మృతదేహాన్ని పడేశారు. పాప ఒంటిమీద చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలు (చైనాలు), బాడీ మీద కేవలం పట్టీలను దుండగులు తీసుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.