
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని క్లియర్ చేయాలి.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి.. ఇప్పటికే చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాం..ఇరాన్ తగ్గి జలసంధిని ఓపెన్ చేయడం ఒక్కటే మార్గం.. అప్పటివరకు భీకర దాడులు కొనసాగిస్తాం..ఇరాన్ ను నామరూపాల్లేకుండా చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పులు విరమణకోరిందని అన్నారు. అయితే తాను కొన్ని కండిషన్స్ పెట్టానన్నారు. కాల్పుల విమరణకు అంగీకరించాలంటే తమ షరతులను ఒప్పుకోవాల్సిందేనని ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకుముందున్న నాయకులకంటే తక్కువ రాడికల్ భావాలున్నవారు , తెలివైన వారు.. ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇప్పుడే కాల్పుల విరమణకు అభ్యర్థించారు అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ ద్వారా హెచ్చరించారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలించాలంటే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. హార్ముజ్ స్వేచ్చగా, క్లియర్ తెరుచుకున్నప్పుడే కాల్పుల విరమణ అభ్యర్థనను పరిశీలిస్తామన్నారు.
ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేస్తాం: ట్రంప్
తమ షరతులకు అంగీకరించకపోతే దాడులు మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. జలసంధిని తెరిచే వరకు మా దాడులు ఆగవు. మేము ఇరాన్‌ను నామరూపాలు లేకుండా పేల్చేస్తాం.. వాళ్లు చెప్పే రాతియుగానికి తిరిగి పంపించేస్తాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ట్రంప్. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.