Reading Time: < 1 minute

లోక్ సభలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

Caption of Image.

ఏపీ అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.1969  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమాకారులను కాంగ్రెస్ కాల్చిచంపిందని వ్యాఖ్యానించారు. చివరి దశ ఉద్యమంలో కూడా 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు.  కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ  ప్రజలు   రాష్ట్రాన్ని సాధించుకున్నారన్న  కిషన్ రెడ్డి..  సుదీర్ణ పోరాటంతో తెలంగాణ కల సాకారమైందన్నారు. 

ఏపీలో ఏడు ఎయిర్ పోర్టులు ఉంటే.. తెలంగాణలో ఒక్కటే ఎయిర్ పోర్టు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలితోనే తెలంగాణకు ఎయిర్ పోర్టులు రాలేదన్నారు కిషన్ రెడ్డి.  ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్దిలో ముందుకెళ్లాలని సూచించారు. 

 కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతర తెలిపారు. కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు.  బీజేపీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు.

ALSO READ : లోక్సభలో విదేశీ విరాళాల బిల్లు వాయిదా.. 

©️ VIL Media Pvt Ltd.